నవ వధువు ఆత్మహత్య | women suicide due to dowry harassment | Sakshi
Sakshi News home page

నవ వధువు ఆత్మహత్య

Sep 23 2016 3:49 PM | Updated on May 25 2018 12:56 PM

అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది.

బీర్కూరు: అత్తింటి వేధింపులు తాళలేక నవ వధువు ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూరు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ప్రశాంత్‌కు ఏడాది క్రితం అదే మండలానికి చెందిన కావ్య(23)తో వివాహమైంది. పెళ్లైనప్పటి నుంచి ప్రశాంత్‌తో పాటు అతని తల్లిదండ్రులు, అక్కలు కలిసి కావ్యను అదనపు కట్నం తీసుకురావాలని వేధించేవారు. దీంతో మనస్తాపానికి గురైన కావ్య పుట్టింటికి వెళ్లి.. నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి పాల్పడింది. తమ కూతురి చావుకు ప్రశాంత్ కుటుంబ సభ్యులే కారణమని బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement