వి మ్యూజిక్ ప్రారంభం

వి మ్యూజిక్ ప్రారంభం


 సినిమాల్లో హీరోగానే కాదు, నిజ జీవితంలోనూ కళ్లెదుట జరిగే అన్యాయాలను ఎదిరించాల ని నాన్న చెబుతుండేవారు. అలాంటి విషయాల్లో న్యాయం పక్కన పోరాడుతానంటున్న నటుడు విశాల్. ఈయనిప్పుడు నటుడు మాత్రమే కాదు సక్సెస్‌ఫుల్ నిర్మాత కూడా. కొత్తగా ఆడియో సం స్థను కూడా ప్రారంభించారు. భవిష్యత్తులో దర్శకుడయ్యే అవకాశం ఉందంటున్న విశాల్ హీరోగా నే కాకుండా నిర్మాతగా కూడా విజయం సాధించా రు. తాజాగా పూజై చిత్రంతో హ్యాట్రిక్ సాధించడానికి రెడీ అవుతున్నారు.

 

 పూజై:
విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై నటుడు విశాల్ హీరోగా నటిస్తూ నిర్మిస్తు న్న మూడో చిత్రం పూ జై. శ్రుతిహాసన్ హీరోయిన్ గా చేస్తు న్న ఈ చిత్రానికి కథ, కథనం, దర్శకత్వం బాధ్యతలు హరి నిర్వహిస్తున్నారు. ఇది తెలుగులోనూ పూజా పేరుతో తెరకెక్కుతోంది. ఈ చిత్రం మాస్ మసాలాగా ఉంటుందనడంలో ఎలాంటి సందేహంలే దు. శరవేగంగా చిత్ర నిర్మాణం జరుపుకుంటున్న ఈ పూజై దీపావళికి సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల పుట్టినరోజును జరుపుకున్న ప్రముఖ నటుడు, నిర్మాత విశాల్ శుక్రవారం చెన్నైలో విలేకరులతో ముచ్చటించారు.

 

 పైరసీపై పోరాడతా: పైరసీ అనేది నేరాతినేరం. ఒకరి కష్టాన్ని మరొకరు దోచుకోవడమే. దాన్ని నిర్మూలించడానికి పోరాడతానని విశాల్ పేర్కొన్నారు. ఆ మధ్య కారైకుడిలో ఇద్దరు పైరసీదారుల ను ధైర్యంగా పోలీసులకు పట్టించారు. దీనిపై ఆయన మాట్లాడుతూ ఇలా తాను మాత్రమే కాదు సూపర్‌స్టార్ రజనీకాంత్, తాను అభిమానించే విజయ్, అజిత్ పరిశ్రమలోని అందరూ పైరసీ నిర్మూలనకు ముందుకు రావాలన్నారు.  



 భవన నిర్మాణం లక్ష్యం: దక్షిణ భారత నటీనటుల సంఘంకు నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణమే తన లక్ష్యంగా విశాల్ పేర్కొన్నారు. (ఈ భవన నిర్మాణ అంశం కోర్టులో ఉంది). ఈ భవన నిర్మాణానికి అవసరమైతే నిధుల కోసం తాను, నటులు ఆర్య, జీవా, జయంరవి తదితర  యువ నటులందరూ కలసి ఎలాంటి స్వార్థం లేకుండా చిత్రం చేయడానికి సిద్ధం అని ఇంతకుముందే చెప్పానన్నారు. అలాగని సంఘం ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీపడే ఆలోచన లేదన్నారు. రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారా? అన్న ప్రశ్నకు మంచి పనులు చేయడానికి రాజ కీయ రంగ ప్రవేశం అవసరం లేదని, అలాంటి ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.  

 

 దీపావళికి పూజై: పూజై చిత్రం నిర్మాణ కార్యక్రమా లు శరవేగంగా జరుగుతున్నాయని తెలిపారు. తా మరభరణి చిత్రం తరువాత దర్శకుడు హరి, తా ను కలసి చేస్తున్న చిత్రం ఇదన్నారు. ఈ చిత్రాన్ని దీ పావళి సందర్భంగా తమిళం, తెలుగు భాషల్లో వి డుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు. మరో విషయం ఏమిటంటే వి.మ్యూజిక్ పేరుతో ఆడియో కంపెనీ ప్రారంభించినట్లు తెలిపారు.

 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top