రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు | vehicles allowed in prakasam barrage | Sakshi
Sakshi News home page

రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు

May 9 2017 4:19 PM | Updated on Sep 5 2017 10:46 AM

రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు.

విజయవాడ: రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీని మంగళవారం మంత్రి దేవినేని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ఆధునీకరణ చేపట్టామని తెలిపారు. 14 కొత్తగేట్లను మార్చామని, 43 గేట్లకు మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ పనులపై నిపుణల కమిటీ బ్యారేజీని పరిశీలిస్తుందన్నారు. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టుకు నీరందించేలా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement