రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి | Three killed in road accidents | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి

Dec 1 2016 1:10 AM | Updated on Aug 28 2018 7:14 PM

త్యాగదుర్గం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. విల్లుపురం జిల్లా త్యాగదుర్గం ప్రాంతానికి చెందిన పాండియన్

టీనగర్ : త్యాగదుర్గం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు మృతిచెందారు. విల్లుపురం జిల్లా త్యాగదుర్గం ప్రాంతానికి చెందిన పాండియన్ కుమారుడు ప్రదీప్‌కుమార్(24). అదే ప్రాంతానికి చెందిన సుకుమార్ కుమారుడు వినోద్‌కుమార్(24). ఇరువురూ ఎలక్ట్రీషియన్‌‌సగా పనిచేస్తున్నారు. వీరి స్నేహితుడు సేదమంగళం గ్రామానికి చెందిన గణేశన్ కుమారుడు జయమూర్తి(20) ప్రైవేటు కళాశాలలో చదువుతున్నాడు. వినోద్‌కుమార్ కొత్త బైక్ కొనడంతో విరుగావూరు గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం స్నేహితులకు విందు ఇచ్చాడు. ఇందులో వినోద్‌కుమార్, ప్రదీప్‌కుమార్, జయమూర్తితో సహా 10 మంది పాల్గొన్నారు. అనంతరం వారు ఇంటికి తిరిగివస్తుండగా వడపూండి బస్టాండు సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు పక్కనున్న గోడను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్నేహితులు అక్కడికక్కడే మృతిచెందారు. దీనిగురించి వరంజరం పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కల్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement