నగరంలోని కాలా చౌకి ప్రాంతంలో వస్త్ర మిల్లులకు సంబంధించిన భారీ మ్యూజియం ఏర్పాటుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నిర్ణయించింది.
సాక్షి, ముంబై: నగరంలోని కాలా చౌకి ప్రాంతంలో వస్త్ర మిల్లులకు సంబంధించిన భారీ మ్యూజియం ఏర్పాటుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) పరిపాలన విభాగం నిర్ణయించింది. ఒకప్పుడు నగరం వస్త్ర మిల్లులకు పుట్టినిల్లుగా ప్రసిద్ధి గాంచింది. దాదాపు 60 మిల్లులు ఇక్కడ ఉండేవి. ఇందులో స్థానికులతోపాటు ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కు చెందిన కార్మికులు ఎక్కువ శాతం పనిచేసేవారు. ఒక్కో మిల్లులో ప్రతి షిప్టుకు సుమారు 5-7 వేల వరకు కార్మికులు, ఇలా రోజుకు మూడు షిఫ్టులు పనిచేసేవారు. దీంతో నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులకంటే మిల్లు కార్మికులే ఎక్కువ శాతం కనిపించేవారు. కాని కాలక్రమేణా మిల్లులు కనుమరుగైపోయాయి.
దీంతో ఈ వస్త్ర పరిశ్రమ ప్రాభవాన్ని నగరవాసులకు మరోసారి గుర్తుచేసేం దుకు బీఎంసీ నడుం బిగించింది. అందుకు కాలా చౌకి ప్రాంతంలో యునెటైడ్ మిల్స్ నం.2, 3 కాం పౌండ్‌లో 4,400 చదరపుటడుగుల స్థలంలో భారీ మ్యూజియాన్ని నిర్మించనున్నారు. అందుకు సంబంధించిన పటాన్ని ఆబా నరాయిన్ లాంబా అసోసియేషన్ రూపొందించింది. మంజూరు కోసం హెరి టేజ్ విభాగానికి పంపించారు. దీనికి మంజూరు లభించగానే బీఎంసీ టెండర్లను ఆహ్వానించనుంది. ఈ మ్యూజియంలో పత్తి నుంచి వస్త్రం ఎలా తయారవుతుంది..అందుకు ఎన్ని ప్రక్రియలు పూర్తిచేయా ల్సి ఉంటుంది.. తదితర విషయాలు వివరించేందుకు వీలుగా అన్ని రకాల యంత్రాలు అందుబాటులో ఉంచనున్నారు.