ఆపదలో ఆదుకున్న చిన్నారి చిట్కాలు | Ten Years Old Girl Tips In Mumbai Fire Accident | Sakshi
Sakshi News home page

ఆపదలో ఆదుకున్న చిన్నారి చిట్కాలు

Aug 22 2018 9:44 PM | Updated on Sep 5 2018 9:47 PM

Ten Years Old Girl Tips In Mumbai Fire Accident - Sakshi

ముంబై: సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడున్న వారంతా భయంతో వణికిపోతారు.అదే అగ్ని ప్రమాదాల్లాంటివయితే చావు భయంతో  తోపుళ్లు, తొక్కిసలాటలతో పరిస్థితి భయానకంగా మారుతుంది.అయితే, ముంబైలోని క్రిస్టల్‌ టవర్‌లో బుధవారం అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆరో తరగతి చదువుతున్న పదేళ్ల అమ్మాయి ఎంతో ధైర్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకున్న వారి ప్రాణాలు కాపాడింది. జెన్‌ సదావర్తే అనే ఆ బాలిక అగ్ని ప్రమాదం కారణంగా వెలువడిన పొగతో ఉక్కిరిబిక్కిరవుతున్న వారికి చిన్న చిట్కాతో ఉపశమనం కలిగించింది.పొగకు ప్లాట్లలోని జనమంతా ఊపిరాడక ఉక్కిరిబిక్కిరవుతోంటే జెన్‌ వాళ్లకి ధైర్యం చెప్పింది. తడి గుడ్డను ముక్కుకు కట్టుకుంటే  పొగలోని కార్బన్‌డయాక్సెడ్‌ ఊపిరితిత్తుల్లోకి వెళ్లదు అని చెప్పింది.

అంతే కాకుండా అందుబాటులో ఉన్న  పాత బట్టల్ని తీసుకొచ్చి వాటిని చిన్న చిన్న ముక్కలుగా(జేబురుమాళ్ల సైజులో)చింపింది. వాటిని తడిపి అందరికీ ఇచ్చి ముక్కుకు కట్టుకోమని చెప్పింది.అంతా అలా చేసి కార్బన్‌డయాక్సైడ్‌ బారి నుంచి బయటపడ్డారు.అలాగే, లిఫ్టులో కిందకి దిగకూడదంటూ వారిని వారించింది.తన దగ్గరున్న ఎయిర్‌ ప్యూరిఫైయర్‌ను కూడా అందరికి ఇచ్చింది.అలాగే అందరూ ఒకేసారి మెట్ల మీదుగా తోసుకుంటూ కిందకి వెళ్లితే జరిగే ప్రమాదాన్ని కూడా వారికి అర్థమయ్యేలా చెప్పింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement