పాపినేని, నాగళ్లకు కేంద్ర సాహిత్య అవార్డులు | Sahitya Akademi award papineni shivashankar | Sakshi
Sakshi News home page

పాపినేని, నాగళ్లకు కేంద్ర సాహిత్య అవార్డులు

Dec 21 2016 4:11 PM | Updated on Sep 4 2017 11:17 PM

కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును బుధవారం ప్రకటించింది.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను బుధవారం ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పాపినేని శివశంకర్‌ను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపిక చేసింది. ఈయన రజనీగంధ అనే కవితా సంపుటిని రచించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం నెక్కల్లు పాపినేని స్వస్థలం. ఫిబ్రవరిలో అవార్డును ప్రదానం చేయనున్నారు.

నాగళ్ల గురుప్రసాద్‌ రావుకు కేంద్ర సాహిత్య అకాడమీ భాషా సమ్మాన్‌ ను ప్రకటించారు. విజయవాడ, గుంటూరులలో తెలుగు అధ్యాపకుడిగా నాగళ్ల గురుప్రసాద్‌ రావు పనిచేశారు. పదవీ విరమణ పొందాక విజయవాడ సిద్ధార్థ కళాపీఠం కార్యదర్శిగా దాదాపు రెండు దశాబ్ధాలు పనిచేశారు. పాపినేని శివశంకర్‌, నాగళ్ల గురుప్రసాద్‌ రావులను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్ మోహన్‌ రెడ్డి ఓ ప్రకటనలో అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement