భివండీలో రోడ్ల పనులు ప్రారంభం | road works starts in bhivandi | Sakshi
Sakshi News home page

భివండీలో రోడ్ల పనులు ప్రారంభం

Dec 25 2014 10:42 PM | Updated on Aug 30 2018 5:49 PM

భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక మేయర్ తుషార్ చౌదరి..

భివండీ, న్యూస్‌లైన్ : భివండీ నిజాంపూర్ శహర్ మహానగర్ పాలిక మేయర్ తుషార్ చౌదరి ఇంకా పదవీ బాధ్యతలు స్వీకరించక ముందే భివండీలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. రూ. 27 కోట్ల అంచనావ్యయంతో భివండీ పట్టణవ్యాప్తంగా ఉన్న 39 రోడ్లను పూర్తిగా ఆధునికీక రించనున్నారు.

ఇందులో ముఖ్యంగా ఐదు ముఖ్య మార్గాలైన కామత్‌ఘర్ తాడాళి, అంజూర్ పాట నుంచి రాజీవ్ గాంధీనగర్, నార్‌పోళి బాలూ పాటిల్ చౌక్ నుంచి దర్గా రోడ్, సమృభాగ్ నుంచి కరివళి రోడ్, కళ్యాణ్ రోడ్‌తోపాటు చిన్న చిన్న మార్గాల ఆధునికీకరణ పనులను బుధవారం సాయంత్రం 4 గంటలకు తుషార్ చౌదరి  ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ కమిషనర్, మాజీ డిప్యూటీ మేయర్ మనోజ్ కాటేకర్, గట్ నేత నిలేష్ చౌదరితోపాటు ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement