ఒక ఆర్డినెన్స్‌ను తిరిగి ప్రకటించడం రాజ్యాంగాన్ని దగా చేయడం, ప్రజాస్వామిక శాసస ప్రక్రియను నాశనం చేయడమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది.
సుప్రీం కోర్టు మండిపాటు
న్యూఢిల్లీ: ఒక ఆర్డినెన్స్‌ను తిరిగి ప్రకటించడం రాజ్యాంగాన్ని దగా చేయడం, ప్రజాస్వామిక శాసస ప్రక్రియను నాశనం చేయడమేనని సుప్రీంకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఆర్డినెన్స్ ప్రకటనకు రాష్ట్రపతి లేదా గవర్నర్ తెలిపే సంతృప్తికి న్యాయసమీక్ష నుంచి రక్షణ లేదని స్పష్టం చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల బెంచ్ సోమవారం 6:1 మెజారిటీతో ఈ మేరకు తీర్పు చెప్పింది. ‘ఆర్డినెన్స్‌కు కూడా చట్టసభ చేసే చట్టానికి ఉన్నంత శక్తి ఉంటుంది. పార్లమెంటు లేదా రాష్ట్ర చట్టసభల ముందు ఆర్డినెన్స్‌ను ఉంచడం తప్పనిసరి. అలా చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘన’ అని మెజారిటీ జడ్జీల తరఫున జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. బిహార్ సర్కార్ ఒక ఆర్డినెన్స్‌ను 4సార్లు ప్రకటించిన కేసును కోర్టు విచారిస్తోంది.