నేడు నాగపూర్‌కు రాహుల్ | Rahul Gandhi to visit Maharashtra | Sakshi
Sakshi News home page

నేడు నాగపూర్‌కు రాహుల్

Sep 24 2013 1:20 AM | Updated on Mar 18 2019 9:02 PM

రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నగరానికి చేరుకోనున్నారు.

నాగపూర్: రాష్ట్రంలో రెండు రోజులు పర్యటించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం నగరానికి చేరుకోనున్నారు. జిల్లా, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఆఫీస్ బేరర్‌లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ జాతీయ కార్వనిర్వాహక సభ్యులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తారని పార్టీ అధికారి ఒకరు తెలిపారు. స్థానిక సౌరబర్ది మెడోస్ రిసార్ట్, చాకోర్ దని రిసార్ట్‌లో ఈ సమావేశాలు ఉంటాయన్నారు.
 
 ఇదే తరహా సమావేశాలను పుణేలోని నాయకులతో బుధవారం నిర్వహిస్తారని వివరించారు. మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సమావేశంలో ప్రసంగించే అవకాశం కూడా ఉందని చెప్పారు. పుణేలో జరిగే సమావేశాలన్నీ బలేవాడి స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆవరణలో జరుగుతాయన్నారు. అయితే ఈ సమావేశాల ఎజెండా గురించి పార్టీ నాయకులేమీ పెదవి విప్పడం లేదు. అయితే రాబోయే లోక్‌సభ ఎన్నికలకు స్థానిక ప్రజా ప్రతినిధులను సన్నద్ధం చేయడంలో భాగంగా ఈ సమావేశాలు జరుగనున్నాయని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement