తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం రోడ్డెక్కారు. వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు.
రోడ్డెక్కిన టీచర్లు, వేలాది మందితో ర్యాలీ
Sep 26 2013 3:14 AM | Updated on Aug 21 2018 5:44 PM
తమ డిమాండ్ల పరిష్కారానికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు బుధవారం రోడ్డెక్కారు. వేలాది మందితో ర్యాలీ నిర్వహించారు. సచివాలయ ముట్టడికి యత్నించారు. వీరిని పోలీసులు అడ్డుకున్నారు. పలువురు ఉపాధ్యాయులను అరెస్ట్ చేశారు.
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వాలని, పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని, టెట్‌ను రద్దు చేయాలనే తదితర తొమ్మిది డిమాండ్లతో ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులు ఆందోళనబాట పట్టారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే విధంగా కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో బుధవారం సచివాలయ ముట్టడికి ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య పిలుపునిచ్చింది. దీంతో రాష్ట్రం నలుమూలల నుంచి ఉపాధ్యాయులు చెన్నైకి తరలివచ్చారు. వీరి ర్యాలీ, నిరసనలకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బృందాలుగా ఏర్పడ్డ ఉపాధ్యాయులు చేపాక్కం అతిథి గృహాల వద్దకు చేరుకున్నారు.
భారీ ర్యాలీ
సుమారు పది వేల మంది ఉపాధ్యాయులు ఒక చోట నుంచి బుధవారం ఉదయం ర్యాలీకి సిద్ధమయ్యూరు. సమాఖ్య ప్రధాన కార్యదర్శి ఈశ్వరన్ నేతృత్వంలో సచివాలయం వైపుగా ర్యాలీ బయలుదేరింది. వీరిని మార్గమధ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉపాధ్యాయులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఫలితంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తారుు. ఆందోళనకారులను పోలీసులు బుజ్జగించారు. తమ డిమాండ్లను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లే విధంగా సచివాలయం వరకు ర్యాలీ నిర్వహించి తీరుతామని ఉపాధ్యాయులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండానే ర్యాలీ నిర్వహించారని పోలీసులు హెచ్చరించడంతో ఆందోళనకారులు కాస్త వెనక్కు తగ్గారు. చివరకు సమాఖ్య నాయకులు, కొందరు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. వీరిని ట్రిప్లికేన్, చే పాక్కంలోని కల్యాణ మండపాల్లో ఉంచారు. తర్వాత విడుదల చేశారు.
Advertisement
Advertisement