వరంగల్‌లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది.
వరంగల్‌కు పాస్‌పోర్టు సేవాకేంద్రం
Mar 2 2017 4:26 PM | Updated on Aug 9 2018 4:51 PM
హైదరాబాద్: వరంగల్‌లో పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. నిజామాబాద్ ఎంపీ కవిత విజ్ఞప్తి మేరకు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఎంపీ కవితకు ఆమె లేఖ రాశారు. వరంగల్ ప్రధాన పోస్టాఫీసులో ఈ సేవా కేంద్రం త్వరలో పనిప్రారంభించనుంది. ఇతర రాష్ట్రాలలో కూడా తపాలా శాఖతో కలిసి పాస్‌పోర్టు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకుంది. పోస్టాఫీసు పాస్ పోర్టు కేంద్రాలుగా వీటిని పిలుస్తారు.
Advertisement
Advertisement