వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన శాండల్‌వుడ్ నటి రమ్యపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు.
బెంగళూరు: వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన మండ్య మాజీ పార్లమెంటు సభ్యురాలు, శాండల్‌వుడ్ నటి రమ్యపై నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు వదులుతున్నారు. ‘భారత దేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ మాత్రమే. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఈ విషయంలో ఏమీ చేయలేదు.’ అని రమ్య పేర్కొన్న నేపథ్యంలో కొందరు నెటిజన్లు స్పందించారు.
గాంధీ, నెహ్రూ తదితర నాయకులతో కలిసి రమ్య ఉన్నట్లు ఫొటోషాప్ ద్వారా ఫొటోలు సృష్టించి ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. ఈ ఫొటోలు వైరల్‌గా మారుతున్నాయి.