తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని నాయిని నర్సింహారెడ్డి చెప్పారు.
విజయవాడ: తెలంగాణ రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోందని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చెప్పారు. ఆదివారం ఆయన విజయవాడలో ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినట్టుగానే తెలంగాణకు కూడా కేంద్రం ఆర్థిక చేయూత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాలు వెనకబడి ఉన్నాయన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించిన ఓటుకు కోట్లు కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని నాయిని తెలిపారు.