ఉపసంఘాల మాటేమిటో! | MLAs in the Assembly request the Secretary | Sakshi
Sakshi News home page

ఉపసంఘాల మాటేమిటో!

Nov 25 2016 2:28 AM | Updated on Sep 4 2017 9:01 PM

శాసనసభ ఉప సంఘాల ఏర్పాటులో జాప్యంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.

జాప్యంతో అసంతృప్తి
అసెంబ్లీ కార్యదర్శికి ఎమ్మెల్యేల వినతి
ఆర్థికమంత్రితోనూ భేటీ

శాసనసభ ఉప సంఘాల ఏర్పాటులో జాప్యంపై కాంగ్రెస్ శాసనసభా పక్షం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. కాంగ్రెస్, ఐయూఎంఎల్ ఎమ్మెల్యేలు స్పీకర్‌తో భేటీకి యత్నించినా, ఆయన అందుబాటులో లేని దృష్ట్యా, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆర్థికమంత్రి ఓ పన్నీరు సెల్వంతోనూ భేటీ అయ్యారు.

సాక్షి, చెన్నై : రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే- 136, డీఎంకే-89, కాం గ్రెస్-ఎనిమిది,  ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్  ఒకటి చొప్పున గెలిచిన విషయం తెలిసిందే. రాష్ట్ర చరిత్రలో ప్రప్రథమంగా బలమైన ప్రధాన ప్రతి పక్షం అధికార పక్షానికి ఎదురుగా కూర్చున్నది. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోంది. అరుుతే, ఇంతవరకు శాసనసభ ఉపసంఘాల ఏర్పాటు మీద ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. కనీసం అందుకు తగ్గ చర్యల్ని స్పీకర్ ధనపాల్ చేపట్టనూ లేదని సంకేతాలు ఉన్నారుు. ఇందుకు కారణం, ప్రధా న ప్రతిపక్షం సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండడమే.

ఉప సంఘాల్లో వారికి తప్పనిసరిగా ప్రాధాన్యతను కల్పించక తప్పదన్న విషయాన్ని గ్రహించి జాప్యం చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ప్రధాన ప్రతి పక్ష నేత ఎంకే స్టాలిన్ శాసన సభ ఉప సంఘాల ఏర్పాటు గురించి ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శాసన సభా పక్షం, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎమ్మెల్యేలు ఏకంగా ప్రభుత్వం, స్పీకర్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, శాసన సభ ఉప సంఘాల ఏర్పాటుకు పట్టుబట్టే పనిలో గురువారం నిమగ్నమైంది.

ఉప సంఘాలు ఎప్పుడో:  కాంగ్రెస్ శాసన సభా పక్ష నేత కేఆర్ రామస్వామి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు వసంతకుమార్, విజయధరణి, ఊటీ గణేషన్, రాజేష్‌కుమార్, కాలి ముత్తులతో పాటు ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ ఎమ్మెల్యే అబూబక్కర్ ఉదయం సచివాలయానికి వచ్చారు. నేరుగా అసెంబ్లీ వైపుగా వెళ్లారు. స్పీకర్ ధనపాల్‌ను కలిసేందుకు ప్రయత్నించారు. అరుుతే, ఆయన అందుబాటులో లేని దృష్ట్యా, అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌ను కలిశారు. ఆయనకు వినతి పత్రం సమర్పించారు. అక్కడి నుంచి ఆర్థికమంత్రి పన్నీరు సెల్వం చాంబర్‌కు వెళ్లిన ఎమ్మెల్యేలు ఆయనతో భేటీ అయ్యారు. నిధుల కేటారుుంపులు గురించి సమాలోచించి ఉన్నారు. వెలుపలకు వస్తూ మీడియాతో కేఆర్ రామస్వామి మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అవుతోందని, ఇంత వరకు శాసన సభ ఉప సంఘాలను ఏర్పాటు చేయక పోవడం శోచనీయమని విమర్శించారు.

 ఇంత వరకు అందుకు తగ్గ చర్యలు చేపట్టనట్టు సంకేతాలు ఉన్నాయని అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాల్లో తాను ఈ విషయంగా ప్రస్తావించడం జరిగిందని గుర్తు చేశారు. ఇందుకు సమాధానం ఇచ్చే క్రమంలో స్పీకర్ ధనపాల్ త్వరితగతిన ఉప సంఘాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. అరుుతే, ఇంత వరకు అందుకు తగ్గ ప్రయత్నాలే చేయక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రధాన ప్రతి పక్షం సభ్యుల సంఖ్య అత్యధికంగా ఉండడం కాబోలు ఆ సంఘాల ఏర్పాటు మీద చిత్తశుద్ధిని పాలకులు కన బరచడం లేదని మండిపడ్డారు. త్వరితగతిన  ఉప సంఘాలను ఏర్పాటు చేయాలని వినతి పత్రం సమర్పించామని, లేని పక్షంలో ఏమి చేయాలో తమకు తెలుసునని, తదుపరి చర్యలు ఉంటాయని వ్యాఖ్యానించారు. ఇక, ఆర్థిక మంత్రి పన్నీరు సెల్వంతో నిధుల కేటారుుంపులు గురించి మాట్లాడినట్టు, ఉప సంఘాల ఏర్పాటు గురించి ఆయన దృష్టికి సమాచారం తీసుకెళ్లామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement