రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం ఎల్లన్‌పేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలి ఆడటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
రంగారెడ్డి జిల్లా మెడ్చల్ మండలం ఎల్లన్‌పేట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలి ఆడటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జారిపడ్డాడా లేక ఎవరైన హత్యచేసి చెరువులో పడేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉంది.