ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌పై, సిందుర గ్రామ్ ప్రధాన్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది.
‘ఆప్’ నేత కుమార్ విశ్వాస్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు
Mar 15 2014 11:06 PM | Updated on Sep 2 2017 4:45 AM
అమేథీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత కుమార్ విశ్వాస్‌పై, సిందుర గ్రామ్ ప్రధాన్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకున్న అల్లర్ల నేపథ్యంలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాగా అల్లర్లో తమ పార్టీ కార్యకర్తలు ఎవరూ పాల్గొనలేదని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అల్లర్లకు కారణమంటూ ఆప్ నేత చేసిన ఆరోపణలను కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ విషయమై కమ్రౌలీ పోలీస్ స్టేషన్ అధికారి ఏపీ తివారీ మాట్లాడుతూ.. ఆప్ నేత కుమార్ విశ్వాస్‌తోపాటు ఆ పార్టీకి చెందిన 65 మందిపై కేసు నమోదు చేశాం. అంతేకాక సిందుర గ్రామ్ ప్రధాన్‌పై, అతని అనుచరులు 20 మందిపై కూడా కేసులు నమోదయ్యాయని చెప్పారు.
Advertisement
Advertisement