కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు.
కేంద్రమంత్రి కోట్ల ఇంట్లో జెండా పండుగ
Jan 27 2014 12:27 AM | Updated on Sep 2 2017 3:02 AM
	సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ఆదివారం నిర్వహించిన గణతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేసి అనంతరం సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో రైల్వే సిబ్బందితోపాటు ఆయన నివాసంలో విధులు నిర్వహించే వారు పాల్గొన్నారు. అనంతరం అందరికీ మంత్రి మిఠాయిలు పంచారు. ఏటా తన నివాసంలో మంత్రి కోట్ల స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
	 
					
					
					
					
						
					          			
						
				Advertisement
Advertisement

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
