ముంబ్రా రైల్వే స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న రైల్వే పోలీసు మీద దాడి జరిపి పారిపోయిన..
సాక్షి, ముంబై: ముంబ్రా రైల్వే స్టేషన్‌లో విధి నిర్వహణలో ఉన్న రైల్వే పోలీసు మీద దాడి జరిపి పారిపోయిన దుండగుడిని బుధవారం రాత్రి పోలీసులు పట్టుకున్నారు. వివరాలిలా ఉన్నాయి... బుధవారం రాత్రి రిజ్వాన్ ఖాజీ (జీఆర్పీ), ముంబ్రా రైల్వే స్టేషన్‌లో డ్యూటీలో ఉండగా గుర్తు తెలియని జేబుదొంగ కత్తితో దాడి జరిపి పారిపోయాడు. కింద పడిపోయిన ఖాజీని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అతని కుడిచేతికి మూడు కుట్లు పడ్డాయని వైద్యులు తెలిపారు. రాత్రి 11.30 గంటలకు అనుమానితుడిని రైల్వే పోలీసులు పట్టుకొని విచారణ నిమిత్తం ఠాణే ైరె ల్వేస్టేషన్‌కు తీసుకుని వెళ్లారని జీఆర్పీ అధికారులు తెలిపారు.