లండన్‌లో కేసీఆర్ దీక్షా దివస్ | kcr deeksha diwas conducted by nri trs cell in london | Sakshi
Sakshi News home page

లండన్‌లో కేసీఆర్ దీక్షా దివస్

Nov 28 2016 7:08 PM | Updated on Aug 16 2018 1:18 PM

లండన్‌లో కేసీఆర్ దీక్షా దివస్ - Sakshi

లండన్‌లో కేసీఆర్ దీక్షా దివస్

ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షా దివస్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు.

రాయికల్ : లండన్‌లోని ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ యూకే ఆధ్వర్యంలో కేసీఆర్ దీక్షా దివస్‌ను సోమవారం ఘనంగా నిర్వహించారు. యూకేలోని వివిధ ప్రాంతాలకు చెందిన టీఆర్‌ఎస్ కార్యకర్తలు హాజరై నెహ్రూ విగ్రహం నుంచి సెంట్రల్ లండన్‌లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుని గాంధీజీకి పూలమాలలతో నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ టీఆర్‌ఎస్ సెల్ అధ్యక్షుడు కూర్మాచలం అనిల్‌ మాట్లాడుతూ ఏడేళ్ల క్రితం తెలంగాణ వచ్చుడో... కేసీఆర్ సచ్చుడో.. నినాదంతో తలపెట్టిన కేసీఆర్ దీక్షతో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బంగారు తెలంగాణ సాధన కోసం ప్రయత్నం చేస్తున్నారని, దీనికి ఎన్‌ఆర్‌ఐలంతా సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు నవీన్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, లండన్ ఇన్‌చార్జి రత్నాకర్, సభ్యులు శ్రీధర్‌రావు, సృజన్‌రెడ్డి, శ్రీకాంత్, సురేశ్, సతీశ్‌రెడ్డి, సంజయ్, వినయ్, నవీన్, బోనగిరి, సత్య, రవి, ప్రదీప్, చింత రంజన్‌రెడ్డి, అశోక్, రవి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement