హెల్మెట్‌ లేదని లారీ డ్రైవర్‌కు జరిమానా!

Karnataka Police Without Helmet Challan to Lorry Driver Viral - Sakshi

వైరల్‌గా మారిన రసీదు  

కర్ణాటక,బొమ్మనహళ్లి: సాధారణంగా బైక్‌పై వెళ్తున్న వారు హెల్మెట్‌ ధరించకుంటే ట్రాఫిక్‌ పోలీసులు జరిమానా విధిస్తారు. అయితే 409 లారీలో వెళ్తున్న డ్రైవర్‌ హెల్మెట్‌ వేసుకోలేదని సదరు డ్రైవర్‌కు జరిమానా విధించిన ఘటన ఉత్తర కన్నడ జిల్లా కార్వార్‌లో చోటుచేసుకుంది. దీంతో రసీదు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర కన్నడ జిల్లా కార్వార సమీపంలోని దాండేలి నగరంలో 409 వాహన డ్రైవర్‌గా నజీర్‌ ఇంటికి పోలీసులు నోటీసు పంపారు. హెల్మెట్‌ ధరించ లేదని జరిమానా చెల్లించాలని నోటీసు పంపారు. దీంతో పోలీసులు నోటీసు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top