వాట్స్‌ఆప్ హెల్ప్‌లైన్‌కు విశేషస్పందన | Sakshi
Sakshi News home page

వాట్స్‌ఆప్ హెల్ప్‌లైన్‌కు విశేషస్పందన

Published Fri, Nov 7 2014 11:10 PM

వాట్స్‌ఆప్ హెల్ప్‌లైన్‌కు విశేషస్పందన - Sakshi

న్యూఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు స్వచ్ఛం దంగా ఫిర్యాదులు చేయడానికి  నగర పోలీస్ విజి లెన్స్ విభాగం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా వాట్స్ ఆప్ హెల్ప్‌లైన్  నంబర్‌ను ప్రవేశపెట్టింది.దీనికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.   ఇప్పటి వరకు విజిలెన్స్ విభాగానికి 40,477 ఫిర్యాదులు ప్రజల నుంచి అందాయి. వాట్స్‌ఆప్ నుంచి వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 6 కేసులను పోలీసులు నమోదు చేశారు.

మరో 6 కేసులు విచారణలో ఉన్నాయి. ఆగస్టు 6వ తేదీన విజిలెన్స్ విభాగం రెండు వాట్స్‌ఆప్ నంబర్లను 1064, 9910641064 ప్రకటించిందని అదనపు పోలీస్ కమిషనర్ (విజిలెన్స్) సింధు పిళ్లై శుక్రవారం విలేకరులకు చెప్పారు.  కానిస్టేబుల్, ఎస్‌ఐ, హోంగార్డు ర్యాంక్‌కు చెందిన మొత్తం 9 మంది పోలీసులపై 6 ఫిర్యాదుల అందాయని చెప్పారు. ఈ నెల 2 వరకు 23 ఫిర్యాదులు అందాయని చెప్పారు. 9 ఫిర్యాదుల ట్రాఫిక్ పోలీసులపై వచ్చాయని, 4 కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.

Advertisement
Advertisement