వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి | Sakshi
Sakshi News home page

వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి

Published Sat, Jul 25 2015 3:03 AM

వారికోసం ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేయండి

♦ వికలాంగులకు ప్రతి జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయాలన్న బాంబే హైకోర్టు
♦ నిపుణులతో ఓ కమిటీ నియామిస్తూ ఉత్తర్వులు
 
 సాక్షి, ముంబై : వికలాంగ విద్యార్థులకు ప్రతి జిల్లాలో ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. ఇందుకోసం నిపుణులతో కూడిన ఓ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ మోహిత్ షా, జస్టిస్ ఎ.కె.మెనన్ వెల్లడించారు. కేం ఆస్పత్రి డాక్టర్లు, నాయర్ ఆస్పత్రికి చెందిన డాక్టర్ హరీశ్ శెట్టి, వైద్య-విద్య పరిశోధన అధికారులు, ప్రజా ఆరోగ్య విభాగ అధికారులు కమిటీలో సభ్యులుగా ఎంపిక చేశారు. ఈ కమిటీ సభ్యులు జిల్లాల్లో కేంద్రాల ఏర్పాటుకు సాంకేతిక సహాయాన్ని అందజేయనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా నాలుగే కేంద్రాలున్నాయి. అందులో ముంబైలో ఒకటి, పుణేలో ఒకటి ఉన్నాయి.

రాష్ట్రంలో 37,358 మంది వైకల్యం కలిగిన విద్యార్థులు పాఠశాలల్లో చదువుకోడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తేలింది. ఈ ప్రత్యేక కేంద్రాల వల్ల వికలాంగ విద్యార్థులకు సరిఫికెట్ల జారీ వంటి పనులు త్వరగా జరుగుతాయి. వైకల్యం ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరీక్షలు రాయడానికి ఎవరినైనా కేటాయించాలని హెచ్‌ఎస్‌సీ, ఎస్‌ఎస్‌సీ బోర్డులకు కోర్టు సూచించింది.

Advertisement
 
Advertisement