రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తు లు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్జత్ పోలీసుల క థనం ప్రకారం బెంగళూర్‌కు చెందిన నందకుమార్,
రోడ్డు ప్రమాదంలో ఐదుగురి మృతి
Oct 20 2013 11:32 PM | Updated on Apr 4 2019 5:24 PM
సాక్షి, ముంబై: రోడ్డు ప్రమాదంలో ఐదుగురు భక్తు లు చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కర్జత్ పోలీసుల క థనం ప్రకారం బెంగళూర్‌కు చెందిన నందకుమార్, అతని కుటుంబసభ్యులు, మరికొందరు మిత్రులు కలిసి రైలులో షిర్డీకి చేరుకున్నారు. అక్కడ బాబాను దర్శించుకుని శని వారం ఓ ప్రైవేటు వాహనంలో పండరీపూర్‌కు బయల్దేరారు. అక్కడ విఠలుడిని దర్శించుకుని తిరి గి బయల్దేరారు. కర్మాలా-నగర్ రహదారిపై పాటేవాడి గ్రామసమీపానికి చేరుకుంటుండగా వీరు ప్రయాణిస్తున్న వాహనం టైరు పంక్చరైంది. నంద కుమార్, అతని భార్య విజయ, కుమార్తె వాహనంలోనే కూర్చున్నారు. మిగతావారంతా రోడ్డుపక్కన నిలబడ్డారు. డ్రైవర్ రహాణే టైరు మార్చడం పూర్తికాగానే వీరంతా వాహనంలో ఎక్కేందుకు సిద్ధమవుతుండగా వెనుక నుంచి వేగంగా వచ్చిన ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ఘటనలో మమతావినయ్ (30), ఎన్. వినయ్ (35), నారాయణ్, అఖిలేష్, రహాణే లు అక్కడికక్కడే మృతి చెందారు. గాయాల పాలైన నందకుమార్, విజయలతోపాటు వారి కుమార్తెను జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలి కర్జత్ తాలూకా పోలీస్‌స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్క డి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement