Keesara ORR Accident: ఓఆర్‌ఆర్‌పై ఘోర రోడ్డు ప్రమాదం

Two People killed In A Road Accident On Keesara ORR  - Sakshi

కీసర: కీసర ఓఆఆర్‌ఆర్‌పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కీసర సి.ఐ రఘువీర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ముంబైకి చెందిన సత్తార్‌ మన్నేర్, జైద్‌ మొమైన్, వాసిమ్‌ మొమైన్, మోడీస్‌లు, డ్రైవర్‌ నియాజ్‌లతో కలిసి కారులో హైద్రాబాద్‌కు వస్తున్నారు. ఈ కమంలో వేగంగా వచ్చిన కారు యాద్గార్‌పల్లి గ్రామ సమీపంలో ఓఆర్‌ఆర్‌పై వేగంగా కల్వర్టును ఢీకొట్టింది.

దీంతో కారు డ్రైవర్‌ నియాజ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న ఓఆర్‌ఆర్‌ పెట్రోలింగ్‌ పోలీసులు, కీసర పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకొని గాయపడ్డ ముగ్గుర్ని చికిత్స నిమిత్తం అంబులెన్స్‌లో నాగారంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వాసిమ్‌ మొమైన్‌ మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి ఈమేరకు కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కారు అతివేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. 

(చదవండి: కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం..14 మంది మృతి)

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top