శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది.
బస్సులో మంటలు.. త్రుటిలో తప్పిన ప్రమాదం
Dec 19 2016 11:19 AM | Updated on Sep 5 2018 9:47 PM
రణస్థలం: శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం డిపోకు చెందిన డీలక్స్ బస్సు సోమవారం ఉదయం రాజమండ్రికి బయలుదేరింది. జాతీయరహదారిపై వెళ్తుండగా రణస్థలం మండలం నెలివాడ సమీపంలో బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డు పక్కన నిలిపేసి ప్రయాణికులను కిందికి దించేశారు. అనంతరం ప్రయాణికులంతా కలిసి మంటలను ఆర్పారు. పెను ప్రమాదం తప్పటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వేరే బస్సుల్లో ప్రయాణికులను గమ్య స్థానాలకు తరలించారు.
Advertisement
Advertisement