సీడ్ రకం వరి ధాన్యానికి రూ. 2000 మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు రాస్తారోకో జరిపారు.
గిట్టుబాటు ధర కోసం రైతుల రాస్తారోకో
Nov 26 2016 3:04 PM | Updated on Jun 4 2019 5:16 PM
గోవిందరావుపేట: సీడ్ రకం వరి ధాన్యానికి రూ. 2000 మద్దతు ధర కల్పించాలని కోరుతూ రైతులు రాస్తారోకో జరిపారు. ప్రొఫెసర్ జయశంకర్ జిల్లా గోవిందరావుపేట మండల కేంద్రంలో జాతీయ రహదారి 163పై రైతులు ఆందోళనకు దిగారు. తమకు ప్రస్తుతం ఇస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదని, రూ. 2000 ధర కల్పించాలంటూ వ్యాపారులతో శుక్రవారం చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలమవడంతో శనివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Advertisement
Advertisement