ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర రాలేదని మనస్తాపానికి గురైన ఓ కందిరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
కందులకు ధర రాలేదని.. రైతు ఆత్మహత్య
Feb 23 2017 11:53 AM | Updated on Oct 1 2018 2:36 PM
దౌల్తాబాద్: ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర రాలేదని మనస్తాపానికి గురైన ఓ కందిరైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం సూరయపల్లిలో గురువారం జరిగింది. గ్రామానికి చెందిన బిచ్చయ్య(52) కందిపంట సాగు చేశాడు. పండిన పంటను అమ్మడానికి యత్నించగా సరైన ధర రాలేదు. దీంతో మనస్తాపానికి గురైన బిచ్చయ్య పొలంలో ఉన్న చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
Advertisement
Advertisement