ఒక్కటైన మరుగుజ్జు జంట

Dwarf Couple Wedding In Karnataka - Sakshi

మాలూరు: రెండున్నర అడుగుల ఎత్తు ఉన్న వరుడు, రెండు అడుగుల ఎత్తు ఉన్న యువతితో వివాహం ఈ నెల 25న హోసకోట తాలూకా జడిగేనహళ్లి గ్రామంలో జరుగ నుండి వివాహ ముందు రోజు శాస్త్రాలను నిర్వహించారు.  తాలూకాలోని యశవంతపుర గ్రామానికి చెందిన దివంగత కృష్ణమూర్తి భాగ్యమ్మ దంపతుల కుమారుడు అనిల్‌కుమార్‌(28), బెంగుళూరు రూరల్‌ జిల్లా విజయపుర పట్టణానికి చెందిన మునియప్ప, సత్యనారాయణమ్మల కుమార్తె వరలక్ష్మి(22)ల వివాహం నిశ్చయమైంది.అనిల్‌కుమార్‌ 2.5 అడుగుల ఎత్తు ఉన్నారు. అనిల్‌ పట్టణంలోని జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ వరకు చదివాడు. అనిల్‌కుమార్‌కు వివాహం చేయాలని పోషకులు అతి కష్టంపై అంతే ఎత్తు ఉన్న 2 అడుగుల ఎత్తున ఉన్న వరలక్ష్మిని వెతికి వివాహం నిశ్చయించారు. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తయింది. సోమవారం హోసకోటలోని కాలభైరవేశ్వర దేవాలయంలో వివాహం జరుగనుంది.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top