శ్రీవారి సేవలో పన్నీరు సెల్వం | Devotees rush normal in Tirumala | Sakshi
Sakshi News home page

శ్రీవారి సేవలో పన్నీరు సెల్వం

Dec 3 2016 10:59 AM | Updated on Sep 4 2017 9:49 PM

శ్రీవారి సేవలో పన్నీరు సెల్వం

శ్రీవారి సేవలో పన్నీరు సెల్వం

తమిళనాడు ఆర్థిక శాఖ మంత్రి పన్నీరు సెల్వం శనివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుపతి : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఆర్థిక శాఖ మంత్రి పన్నీరు సెల్వం శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం వేదపండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందించారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి నాలుగు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, కాలినడక భక్తులకు మూడు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలలోపు సమయం పడుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement