‘చీకటి ఒప్పందం బయటపడింది’ | 'Dark agreement survived' | Sakshi
Sakshi News home page

‘చీకటి ఒప్పందం బయటపడింది’

Oct 19 2013 12:53 AM | Updated on Sep 1 2017 11:45 PM

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌శాఖ కార్యదర్శి భార్య పేరున విదేశీ ఖాతాల్లో డబ్బున్న వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది.

సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్‌శాఖ కార్యదర్శి భార్య పేరున విదేశీ ఖాతాల్లో డబ్బున్న వ్యవహారంపై ఉన్నతస్థాయి కమిటీతో విచారణ చేపట్టాలని బీజేపీ డిమాండ్ చేసింది. ఢిల్లీ ప్రభుత్వం వెంటనే ఎన్నికల కమిషన్‌ను కలిసి ఢిల్లీ విద్యుత్‌శాఖ కార్యదర్శిని విధుల్లోంచి తప్పించే లా చర్యలు తీసుకోవాలని బీజేపీ ఢిల్లీప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ సూచించారు. అధికారుల ఖాతాల్లోకి అడ్డగోలుగా డబ్బుల ప్రవాహాన్ని చూస్తే ప్రభుత్వం, విద్యుత్ కంపెనీల మధ్య చీకటి ఒప్పందం కుదిరినట్టు తేటతెల్లమవుతోందని ఆరోపించారు. 
 
 పదిహేనేళ్ల కాంగ్రెస్‌పాలనలో విద్యుత్ చార్జీలు 300 శాతం పెరగడానికి ఇవే ప్రధాన కారణమని ఆయన దుయ్యబట్టారు. తాము అధికారంలో వస్తే కరెంటు చార్జీలను 30 శాతం వరకు తగ్గిస్తామని ప్రకటిం చారు. ‘విద్యుత్‌శాఖ కార్యదర్శి భార్య పేరిట విదేశీబ్యాంకు ఖాతాల్లో లెక్కకు మించి డబ్బు జమయింది. గృహిణి అయిన ఆమె పేర ఇంత పెద్ద మొత్తంలో నగదు ఎలా జమచేయగలిగా రు ? ఆ డబ్బు ఎలా వచ్చింది. 
 
 భారీస్థాయిలో విద్యుత్ కుంభకోణం జరి గిందనడానికి ఇదే ఆధారం. ఈ విషయం బయటికి వచ్చిన తర్వా త 24 గంటలపాటు ఎదుదురు చూశాం. అయి నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. అందుకే ఇప్పుడు స్పందిస్తున్నాం’ అని గోయల్ పేర్కొన్నారు. విద్యుత్ శాఖ కార్యదర్శి ఫోన్‌కాల్స్ వివరాలను బయటపెట్టాలని గోయల్ డిమాండ్ చేశారు. కాల్‌డేటా బయటపెడితే కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులకు మధ్య ఉన్న సంబంధాలు బయటికి వస్తాయన్నారు. ప్రస్తుతం ఢిల్లీ విద్యుత్‌శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్న అధికారిని ఇటీవలే గోవాకి బదిలీ చేశారని, మళ్లీ ఆయననే గోవా నుంచి ఢిల్లీకి పిలి పించారని పేర్కొన్నారు. వీట న్నింటిపై సమగ్ర విచారణ చేయాలని విజయ్ గోయల్ డిమాండ్ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement