కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన నీచ ఘటన గదగ్ జిల్లాలోని శివహట్టి తాలూకాలో చోటుచేసుకుంది.
బనశంకరి: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి కన్న కూతురిపైనే అత్యాచారానికి పాల్పడిన నీచ ఘటన గదగ్ జిల్లాలోని శివహట్టి తాలూకాలో చోటుచేసుకుంది. శివహట్టికి చెందిన కామాంధుడు మలసంది తన నాలుగేళ్ల కుమార్తెపై రెండు రోజుల క్రితం అత్యాచారానికి పాల్పడ్డాడు. తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆస్పత్రికి తరలించగా విషయం వెలుగులోకి వచ్చింది.
భర్తే ఈ దుర్ఘటనకు పాల్పడినట్లు తెల్సినా భార్య అతని పేరు బయటకు చెప్పలేదు. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని, బాధితురాలిని తమదైన శైలిలో విచారణ చేయడంతో ఆమె అసలు విషయం వెల్లడించింది. పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అతని కోసం గాలింపు చేపట్టారు.