అదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది.
అదిలాబాద్‌లో చిరుత సంచారం
Mar 6 2017 10:41 AM | Updated on Aug 17 2018 2:56 PM
హత్నూర్: అదిలాబాద్ జిల్లాలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. జిల్లాలోని బజార్ హత్నూర్ మండల శివారులో సోమవారం తెల్లవారుజామున చిరత సంచరిస్తున్నట్లు గుర్తించిన స్థానికులు భయందోళనలకు గురవుతున్నారు. శివారు ప్రాంతాల్లోని అడవుల్లో సంచరిస్తున్న చిరుత పశువుల మందపై దాడి చేసి రెండు గేదెలను గాయపర్చడంతో.. సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చిరుత బెడద నుంచి తమను కాపాడాలని అధికారులు వేడుకుంటున్నారు.
Advertisement
Advertisement