ఇస్రో ఆధ్వర్యంలో 2017వ సంవత్సరంలో చంద్రుడిపైకి మానవ సహిత శాటిలైట్(చంద్రయాన్-2)ను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇస్రో డెరైక్టర్ శివకుమార్ తెలిపారు.
- ఇస్రో డెరైక్టర్ శివకుమార్ వెల్లడి
వేలూరు(తమిళనాడు): ఇస్రో ఆధ్వర్యంలో 2017వ సంవత్సరంలో చంద్రుడిపైకి మానవ సహిత శాటిలైట్(చంద్రయాన్-2)ను పంపేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు ఇస్రో డెరైక్టర్ శివకుమార్ తెలిపారు. వేలూరులోని వీఐటీ (వేలూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) యూనివర్సిటీలో శాటిలైట్ సంబంధిత అంతర్జాతీయ సదస్సు వీఐటీ ఉపాధ్యక్షుడు జీవీ సెల్వం అధ్యక్షతన శనివారం జరిగింది. ఇస్రో డెరైక్టర్ శివకుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రస్తుతం పీఎస్‌ఎల్‌వీ, జీఎస్‌ఎల్‌వీ అనే వాహక నౌకలను అంతరిక్షంలోకి పంపుతున్నామన్నారు.
ప్రభుత్వం ఆర్థిక వనరులు సమకూరిస్తే చంద్రయాన్-2 శాటిలైట్‌ను పంపవచ్చన్నారు. ఇది నాలుగు వేల నుంచి ఐదు వేల కి లోల బరువు ఉంటుందని తెలిపారు. అనంతరం సదస్సు సీడీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎన్‌పీఎస్ ప్రొఫెసర్ గోసవ్యా, యూకే యూనివర్సిటీ ప్రొ. ఆల్ కేంద్రన్, వీఐటీ బిజినెస్ స్కూల్ ప్రిన్సిపాల్ గీత పనివాసగం పాల్గొన్నారు.