నయీం గ్యాంగ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.
నయీం గ్యాంగ్ పేరుతో బెదిరింపులు..
Jan 16 2017 11:07 AM | Updated on Oct 17 2018 6:06 PM
నిజామాబాద్ : నయీం గ్యాంగ్ పేరిట బెదిరింపులకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలోని సిరికొండ, దర్పల్లి మండలాల పరిధిలో గ్యాంగ్‌స్టర్ నయీం పేరుతో బెదిరింపులకు దిగుతున్న ముగ్గురు సభ్యుల ముఠాను అదుపులోకి తీసుకున్నారు. తమకు బెదిరింపులు వస్తున్నాయని బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
Advertisement


