వైష్ణవీ మాతా న మో నమః | Bound for Anand Vihar, superfast train pulls into New Delhi | Sakshi
Sakshi News home page

వైష్ణవీ మాతా న మో నమః

Jul 14 2014 10:43 PM | Updated on Sep 2 2017 10:17 AM

ఢిల్లీ-కత్రాల మధ్య తొలి సూపర్‌ఫాస్ట్ రైలు సేవలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ‘శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్ ఏసీ రైలును సంబంధి త అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

 న్యూఢిల్లీ: ఢిల్లీ-కత్రాల మధ్య తొలి సూపర్‌ఫాస్ట్ రైలు సేవలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ‘శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్ ఏసీ రైలును సంబంధి త అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మాతా వైష్ణో దేవి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కత్రాకు ఇక్కడి నుంచి సోవ ప్రతిరోజూ నడవనుంది. సాయంత్రం 5.30కు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.10 నిమిషాలకు శ్రీమాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్‌కు చేరుకుంటుందని వారు చెప్పారు. అలాగే అదేరోజు రాత్రి 10.55కు అక్కడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45కు ఢిల్లీ చేరుకుంటుందని వివరించారు.
 
 ఇందులో మొత్తం 15 ఏసీ బోగీలు ఉన్నాయని, ఇది అంబాలా కంటోన్మెంట్, లూథియానా, జలంధర్. పఠాన్‌కోట్, జమ్మూతావి, ఉధంపూర్ స్టేషన్‌లలో ఆగుతుందన్నారు. ఈ నెల నాలుగవ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, వైష్ణోదే వి దేవాలయాన్ని ప్రతిఏడాది సుమారు కోటి మంది సందర్శిస్తారని అంచనా. కాగా, కత్రా రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులను ఏర్పాటుచేశారు. ఇక్కడ సందర్శకుల సౌకర్యార్థం టూరిస్టు కౌంటర్, క్లాక్ రూం, వెయిటింగ్ హాలు, వీఐపీ లాంజ్, ఎస్కలేటర్లు, లిఫ్టు వంటి ఎన్నో సౌకర్యాలను అమర్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement