breaking news
superfast train
-
ఏసీ బోగీలో పాము!
సాక్షి, అన్నానగర్: తమిళనాడులోని కోవై నుంచి చెన్నైకు వస్తున్న చేరన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. చెన్నై సెంట్రల్-కోయంబత్తూరు మధ్య నడిచే చేరన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12674) గురువారం రాత్రి కోవై నుంచి చెన్నైకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం చెన్నై సెంట్రల్‌కు సమీపిస్తుండగా బి-3 ఏసీ బోగీలోని ఒక ప్రయాణికుడు తన లగేజీని తీసుకుంటుండగా బెర్త్ కింద పాము కనిపించింది. భయాందోళన చెందిన అతను కేకలు పెట్టాడు. అతడి అరుపులు విని ఇతర ప్రయాణికులు కూడా కేకలు పెడుతూ పరుగులు తీశారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో చెన్నై సెంట్రల్ స్టేషన్ రావడంతో బోగీలోని ప్రయాణికలు తమ లగేజీలు తీసుకుని దిగారు. కాగా, ఏసీ బోగీలో పాము ఉందని, దాన్ని తొలగించామని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ చెప్పారు. అయితే అది అక్కడకు ఎలా వచ్చిందో తెలియలేదని, విచారిస్తున్నట్టు తెలిపారు. అది పొడవైనదిగాను, విషపామువలే ఉందని ఆ బోగీలో ఉన్న భువన అనే ప్రయాణికురాలు తెలిపింది. -
వైష్ణవీ మాతా న మో నమః
న్యూఢిల్లీ: ఢిల్లీ-కత్రాల మధ్య తొలి సూపర్‌ఫాస్ట్ రైలు సేవలు సోమవారం సాయంత్రం ప్రారంభమయ్యాయి. ‘శ్రీ శక్తి ఎక్స్‌ప్రెస్ ఏసీ రైలును సంబంధి త అధికారులు పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు మాతా వైష్ణో దేవి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కత్రాకు ఇక్కడి నుంచి సోవ ప్రతిరోజూ నడవనుంది. సాయంత్రం 5.30కు బయల్దేరి మరుసటి రోజు తెల్లవారుజామున 5.10 నిమిషాలకు శ్రీమాతా వైష్ణోదేవి కత్రా స్టేషన్‌కు చేరుకుంటుందని వారు చెప్పారు. అలాగే అదేరోజు రాత్రి 10.55కు అక్కడ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.45కు ఢిల్లీ చేరుకుంటుందని వివరించారు. ఇందులో మొత్తం 15 ఏసీ బోగీలు ఉన్నాయని, ఇది అంబాలా కంటోన్మెంట్, లూథియానా, జలంధర్. పఠాన్‌కోట్, జమ్మూతావి, ఉధంపూర్ స్టేషన్లలో ఆగుతుందన్నారు. ఈ నెల నాలుగవ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ రైలును లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా, వైష్ణోదే వి దేవాలయాన్ని ప్రతిఏడాది సుమారు కోటి మంది సందర్శిస్తారని అంచనా. కాగా, కత్రా రైల్వే స్టేషన్‌కు ఆధునిక హంగులను ఏర్పాటుచేశారు. ఇక్కడ సందర్శకుల సౌకర్యార్థం టూరిస్టు కౌంటర్, క్లాక్ రూం, వెయిటింగ్ హాలు, వీఐపీ లాంజ్, ఎస్కలేటర్లు, లిఫ్టు వంటి ఎన్నో సౌకర్యాలను అమర్చారు.