కేసీఆర్‌ రైతులను గాలికొదిలేశారు: కిషన్‌ రెడ్డి | bjp leader kishan reddy slams cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ రైతులను గాలికొదిలేశారు: కిషన్‌ రెడ్డి

May 4 2017 2:03 PM | Updated on Sep 5 2017 10:24 AM

టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, బహిరంగ సభల కోసం వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసీఆర్‌ రైతులను గాలికి వదిలేశారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మండిపడ్డారు.

హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ప్లీనరీ, బహిరంగ సభల కోసం వ్యాపారుల దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసీఆర్‌ రైతులను గాలికి వదిలేశారని బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బహిరంగ సభ కోసం ట్రాక్టర్లను బ్లాక్‌ చేసి.. మిర్చి పంట తరలించేందుకు వాహనాలు లేకుండా చేశారన్నారు. ఖమ్మంలో జరిగిన ఘటన రైతుల బాధలో నుంచి పుట్టుకొచ్చిందని.. దాన్ని తప్పించుకోవడానికి ప్రతిపక్షాల కుట్ర అని సర్కార్‌ అబద్ధమాడుతోందని తెలిపారు. ప్రభుత్వం రైతులపై కేసులు పెట్టడం దారుణమన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కార్‌కు రైతులపై సవతి తల్లి ప్రేమ మాత్రమే ఉందని ఎద్దేవా చేశారు. కేంద్రం రూ. 5 వేల ధర ప్రకటించిందని.. రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులకు బోనస్‌ ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఖమ్మం మిర్చియార్డ్‌ను సందర్శించి జైళ్లో ఉన్న రైతులకు పరామర్శించనున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement