యాదాద్రి కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా | bjp dharna at yadadri collectarate | Sakshi
Sakshi News home page

యాదాద్రి కలెక్టరేట్ వద్ద బీజేపీ ధర్నా

Nov 8 2016 2:00 PM | Updated on Mar 29 2019 9:14 PM

పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరిజిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేపట్టింది.

యాదాద్రి: పలు ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ యాదాద్రి భువనగిరిజిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బీజేపీ ధర్నా చేపట్టింది. రైతులకు రుణ మాఫీ చేయాలని, ప్రధాన మంత్రి ఫసల బీమా యోజనను సక్రమంగా అమలు చేయాలని, పేద, దళిత రైతులకు మూడెకరాల భూమి పంపిణీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తున్నది. అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు వెంటనే విడుదల చేయాలని, పేద, మధ్య తరగతి ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే ప్రధాన డిమాండ్లతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ధర్నా చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement