బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించుకునేందుకు రాజ్యాంగంలో ఏదైనా నిబంధన ఉందా అని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రాజ్యాంగంలో ఉందా ?: హైకోర్టు
Feb 12 2014 10:36 PM | Updated on Apr 4 2018 7:42 PM
సాక్షి, న్యూఢిల్లీ: బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహించుకునేందుకు రాజ్యాంగంలో ఏదైనా నిబంధన ఉందా అని ఢిల్లీ హైకోర్టు బుధవారం ఆప్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బహిరంగ ప్రదేశంలో అసెంబ్లీ నిర్వహించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించడాన్ని సవాలుచేస్తూ ఢిల్లీ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేదార్ బుధవారం దాఖలుచేసిన పిటిషన్‌ను పరిశీలించిన జస్టిస్ బి. డి. అహ్మద్, సిద్దార్ధ్ మృదుల్‌ల నేతృత్వంలోని ధర్మాసనం పైవిధంగా స్పందించింది. ‘మీ ప్రభుత్వానికి శాసనసభ ఉండగా మరొక వేదిక ఎందుకని ప్రశ్నించింది.
మరోచోట నిర్వహించాల్సిన అవసరం ఏమిటో తెలియజేయాలని ఆదేశించింది. అసెంబ్లీ వెలుపల విధానసభ సమావేశం నిర్వహించడానికి లెఫ్టినెంట్ గవర్నర్ అంగీకరించారా? అని కూడా ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. కాగా దేశంలో ఎక్కడా ఇప్పటిదాకా అసెంబ్లీ సమావేశాలు బహిరంగ ప్రదేశంల జరగలేదనే విషయాన్ని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మరోచోట అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తే అందుకు రూ. 50 లక్షలు ఖర్చవుతాయని ఆయన అందులో పేర్కొన్నారు. ఇందుకు గురువారంలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ సర్కారుకు నోటీసు జారీ చేసింది.
Advertisement
Advertisement