బెంగళూరులో ఏపీ పారిశ్రామిక వేత్త హత్య
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పారిశ్రామిక వేత్త బెంగళూరులో హత్యకు గురయ్యారు.
బెంగళూరు: గుంటూరు జిల్లాకు చెందిన పారిశ్రామిక వేత్త, పరుచూరి గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పరుచూరి సురేంద్రనాథ్(60) బెంగళూరులో హత్యకు గురయ్యారు. ఎప్పుడూ గట్టి భద్రత మధ్య ఉండే ఆయన వాహనాన్ని ఆదివారం రాత్రి ఇద్దరు దుండగులు వెంబడించారు. సంజయ్‌నగర్‌లోని సురేంద్రనాథ్ నివాసం వద్ద అయనపై దుండగులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సురేంద్రనాథ్ మృతి చెందారు. వ్యాపారంలోని ప్రత్యర్థులే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ ఘటన జరిగిన సమయంలో ఆయన సిబ్బంది వెంట లేరని సమాచారం. ఈ ఘాతుకం వెనుక మాజీ సిబ్బంది హస్తం ఉండవచ్చని అనుమానిస్తున్నారు. దుండగుల కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.15 ఏళ్లుగా సురేంద్రనాథ్ బెంగళూరులోనే నివాసముంటన్నారు.


