
అన్నాడీఎంకే నేతల ఇళ్లపై పెట్రోబాంబు
తూత్తుకుడి జిల్లాలో అన్నాడీఎంకే నేతల ఇళ్లపై పెట్రో బాంబు దాడి చేసి ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు.
రెండు బైకులకు నిప్పు
తిరువొత్తియూరు: తూత్తుకుడి జిల్లాలో అన్నాడీఎంకే నేతల ఇళ్లపై పెట్రో బాంబు దాడి చేసి ద్విచక్ర వాహనాలకు నిప్పు పెట్టారు. నిందితుల కోసం పోలీసులు విచారణ చేస్తుండగా కళుగుమలైలో అన్నాడీఎంకే నిర్వాహకుని ఇంటిలో నిలిపి ఉంచిన బైకుకు నిప్పు పెట్టిన సంఘటన సంచలనం కలిగించింది. కలుగుమలై నగర్ అన్నాడీఎంకే యువజన, యువజన మహిళా పాసరై కార్యదర్శిగా ఉంటున్న ముత్తురాజ్. ఇతను అగ్గిపెట్టెలు తయారీ పరిశ్రమ నడుపుతున్నాడు.
శనివారం ఇతను నిద్ర లేచి బయటకు వచ్చి చూడగా ఇంటి ముందు నిలిపి ఉంచిన బైకు, సైకిల్, గ్రైండర్‌లకు నిప్పు అంటించి ఉన్నాయి. ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతను స్థానికుల సహాయంతో మంటలు ఆర్పి దీనిపై కళుగుమలై పోలీసు నిలయంలో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.
శుక్రవారం అన్నాడీఎంకే నగర కార్యదర్శి గోపి ఇంటి ముందు నిలిపి ఉంచిన కారు, ఎంజీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన మరో సంఘటన జరగడంతో ఈ చర్యలకు పాల్పడుతున్న వారిని వెంటనే అరెస్టు చేయాలని అన్నాడీఎంకే వారు కలుగుమలై -కోవిల్‌పట్టి రోడ్డులో ఆందోళన చేపట్టారు.