టాయిలెట్లో 5 కేజీల బంగారం | 5kg gold found stashed in plane toilet at chennai | Sakshi
Sakshi News home page

టాయిలెట్లో 5 కేజీల బంగారం

Sep 11 2015 8:37 AM | Updated on Sep 3 2017 9:12 AM

టాయిలెట్లో 5 కేజీల బంగారం

టాయిలెట్లో 5 కేజీల బంగారం

మలేషియా నుంచి చెన్నైకి చేరుకున్న విమానం నుంచి ఐదు కిలోల బంగారును కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు.

చెన్నై: మలేషియా నుంచి చెన్నైకి చేరుకున్న విమానం నుంచి ఐదు కిలోల బంగారును కస్టమ్స్ అధికారులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. తెల్లవారుజాము 2.30గంటలకు కౌలాలంపూర్ నుంచి ఏయిర్ ఇండి యా విమానం చెన్నై విమానాశ్రయం చేరుకుంది. ఈ విమానంలో పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలిస్తున్నట్లు ముందుగానే అధికారులకు సమాచారం రావడంతో ప్రయాణికులను మరింత తీవ్రంగా తనిఖీ చేయడం ప్రారంభించారు.
 
అయితే ఎవ్వరి వద్ద బంగారు దొరకలేదు. ఆ తరువాత విమానంలోని టాయిలెట్‌ను తనిఖీ చేయగా అక్కడి వాటర్‌ట్యాంక్‌లో నల్లని బ్యాగులో బంగారం దొరికింది. 500 గ్రాముల బరువున్న 10 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 5 కిలోల ఈ బంగారు విలువ ప్రపంచ మార్కెట్‌లో రూ.1.5 కోట్లుగా అధికారులు తెలిపారు. విమానాశ్రయంలో తీవ్రస్థాయిలో తనిఖీలు సాగుతున్నట్లు గ్రహించిన ప్రయాణికుడు బంగారు ప్యాకెట్‌ను టాయిలెట్‌లో దాచి పారిపోయినట్లు అధికారులు భావిస్తున్నారు.      
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement