లారెన్స్‌ అనాథాశ్రమంలో 20 మందికి కరోనా | 20 COVID-19 Cases Reported At Chennai Actor Raghava Lawrences Trust | Sakshi
Sakshi News home page

లారెన్స్‌ అనాథాశ్రమంలో 20 మందికి కరోనా

May 27 2020 7:57 AM | Updated on May 27 2020 7:57 AM

20 COVID-19 Cases Reported At Chennai Actor Raghava Lawrences Trust - Sakshi

కరోనా మహమ్మారి ఇప్పట్లో వదిలేట్టు లేదు. ముఖ్యంగా తమిళనాడులో ఈ వ్యాధి విజృంభణ కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు లారెన్స్‌ అనాథాశ్రమంలో మరో 20 మందికి ఈ వ్యాధి సోకింది. నటుడు లారెన్స్‌ అనాథలు, దివ్యాంగుల కోసం స్థానిక అశోక్‌నగర్‌లో లారెన్స్‌ ట్రస్ట్‌ ద్వారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

ఆ ప్రాంతంలో ఇద్దరికి కరోనా వ్యాధి సోకడంతో ఆరోగ్య శాఖ అధికారులు వారితో పాటు, లారెన్స్‌ అనాథాశ్రమంలోని అందరికీ కరోనా వరీక్షలు నిర్వహించారు. ఆ ఆశ్రమంలో ఉన్న 20 మందికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. వారిని స్థానిక నుంగంబాక్కంలోని లయో లా కాలేజీలో ఏర్పాటు చేసిన శిబిరానికి తరలించారు. కరోనా వ్యాధి సీరియస్‌గా ఉన్న వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవ లు అందిస్తున్నారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. చదవండి: నటుడు సూర్యకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement