డివిలియర్స్, కోహ్లీ డకౌట్‌లకు కారణం అదే!
క్రికెటర్లతో సెల్ఫీ దిగిన పాపానికి ఓ పాకిస్తానీ పాత్రికేయురాలు అడ్డంగా బుక్కయ్యారు.
లండన్: క్రికెటర్లతో సెల్ఫీ దిగిన పాపానికి ఓ పాకిస్తానీ పాత్రికేయురాలు అడ్డంగా బుక్కయ్యారు. సోషల్ మీడియాలో క్రికెట్ ఫ్యాన్స్ ఆమెపై అకారణంగా విరుచుకుపడుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఛాంపియన్స్ ట్రోఫి సందర్భంగా పాకిస్తాన్ స్పోర్స్ట్ రిపోర్టర్ జైనాబ్ అబ్బాస్.. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్‌తో సెల్ఫీలు దిగారు. ఆ సెల్పీలు చూసుకొని ఆమె సంబరపడిపోయింది కూడా. కానీ.. ఆ తరువాతే ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. అనూహ్యంగా ఆమెతో సెల్ఫీలకు పోజిచ్చిన ఇద్దరు బ్యాట్స్‌మెన్ డకౌట్ అయ్యారు. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో డివిలియర్స్ డకౌట్ కాగా.. శ్రీలంకతో మ్యాచ్‌లో కోహ్లీ ఖాతా తెరవలేదు. దీంతో జైనాబ్‌పై సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. గతంలోనూ విరాట్ కోహ్లీ విఫలమవడానికి అనుష్క శర్మ కారణమని విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.