వైరల్‌: యువీ నువ్వు కేక!

Yuvraj Singh Adds New Dimension to Bottle Cap Challenge - Sakshi

ముంబై : ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌’  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ ట్రెండ్‌ అవుతున్న కొత్త సవాల్‌. ఫిట్‌నెస్‌ చాలెంజ్‌, ఐస్‌బకెట్‌ చాలెంజ్‌, కీకీ చాలెంజ్‌, ప్యాడ్‌మన్‌ చాలెంజ్‌ తరహాలో బాటిల్‌ చాలెంజ్‌ సైతం తెగహల్‌చల్‌ చేస్తోంది. ఏదైనా బాటిల్‌ను ఎత్తులో ఉంచి కాలితో ఆ బాటిల్‌ మూతను పడగొట్టడం ఈ చాలెంజ్‌ ముఖ్య ఉద్దేశం.  ఇప్పటికే టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌.. ఇలా అన్ని వుడ్‌ల సినీ తారాలు.. అన్ని రంగాల క్రీడాకారులు ఈ చాలెంజ్‌ను స్వీకరించి.. ఆ వీడియోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తున్నారు.

టీమిండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సైతం ఈ సవాల్‌ను స్వీకరించాడు. అయితే అందరిలా చేస్తే తాను యువరాజ్‌ ఎందుకైతా? అకున్నాడో ఏమో.! కానీ తనదైన శైలిలో బ్యాట్‌తో టెన్నిస్‌ బంతిని బాటిల్‌కు కొట్టి క్యాప్‌ కిందపడేశాడు. ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ‘బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌లో ఇది నా వర్షన్‌‌.. బ్రియాన్‌ లారా, శిఖర్‌ ధావన్‌, సచిన్‌ టెండూల్కర్‌లకు సవాల్‌ విసురుతున్నాను.’ అనే క్యాప్షన్‌తో పంచుకున్నాడు. అయితే ఈ చాలెంజ్‌లో యువీ వారికి ఓ ట్విస్ట్‌ ఇచ్చాడు. అందరూ ఎడమచేతివాటంతో చేయాలని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ చాలెంజ్‌ పట్ల వినూత్నంగా ఆలోచించిన యువరాజ్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.. ‘  యువీ.. నువ్వు కేక’ అంటూ కొనియాడుతున్నారు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top