
ప్రాబబుల్స్‌లో రాహుల్, సంతోషి
ఈ ఏడాది జరగనున్న మూడు మెగా ఈవెంట్ల కోసం భారత సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించారు.
కామన్వెల్త్, ఆసియా క్రీడలకు వెయిట్‌లిఫ్టింగ్ జట్లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది జరగనున్న మూడు మెగా ఈవెంట్ల కోసం భారత సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ ప్రాబబుల్స్ జాబితాను ప్రకటించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాగాల వెంకట రాహుల్, మత్స్య సంతోషి ఎంపికయ్యారు. వీరితో పాటు మరో తెలుగుతేజం కోరాడ రమణకు కూడా చోటు దక్కింది.
కామన్వెల్త్ గేమ్స్ (గ్లాస్గో), ఆసియా గేమ్స్ (ఇంచియాన్), ప్రపంచ చాంపియన్‌షిప్‌ల కోసం భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య బుధవారం 26 మందితో కూడిన జాబితాను ప్రకటించింది. పురుషుల 56 కేజీ కేటగిరీలో రమణ, 77 కేజీ విభాగంలో వెంకట రాహుల్ చోటు దక్కించుకోగా, మహిళల 53 కేజీ కేటగిరీలో మత్స్య సంతోషి ఎంపికైంది.