అలా చేయడంలో సక్సెస్ అయ్యాం: టేలర్

we put pressure on their spinners, says Taylor

ముంబై:టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించడం పట్ల న్యూజిలాండ్ బ్యాట్స్ మన్ రాస్ టేలర్ ఆనందంలో మునిగితేలుతున్నాడు. ప్రధానంగా భారత స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ ల బౌలింగ్ లో ఎదురుదాడికి దిగి సక్సెస్ కావడాన్ని బాగా ఆస్వాదించినట్లు టేలర్ పేర్కొన్నాడు. 'భారత్ స్పిన్నర్లను స్వీప్ షాట్లతో బెదరగొట్టాలనుకున్నాం.  ఆ క్రమంలోనే లాథమ్ రివర్స్ స్వీప్ షాట్లతో భారత స్పిన్నర్ల లైన్ ను దెబ్బ తీశాడు. లాథమ్ కు స్వీప్ షాట్లతో దాడి చేయమని నేనే చెప్పా. ముఖ్యంగా రివర్స్ స్వీప్ ను లాథమ్ చాలా బాగా ఆడాడు. ఒకసారి స్పిన్నర్లపై ఎటాక్ చేస్తే ఆటోమేటిక్ వారి లైన్ దిబ్బతింటుంది. అది మా వ్యూహంలో భాగమే. దాన్ని ఫీల్డ్ లో లాథమ్ బాగా అమలు చేశాడు'అని టేలర్ పేర్కొన్నాడు.

తొలి వన్డేలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారత్ విసిరిన 281 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. లాథమ్-టేలర్ లు అసాధారంగా ఆడి రెండొందల పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు చక్కటి విజయాన్ని అందించారు. ఈ క్రమంలోనే లాథమ్ సెంచరీ చేయగా, టేలర్ 95 పరుగులు చేశాడు.

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top