పంద్రాగస్టు: కోహ్లి సరికొత్త చాలెంజ్‌

Virat Kohli Veshbhusha Challenge Gone Viral - Sakshi

లండన్‌ : సోషల్‌ మీడియాలో చాలెంజెస్‌ ట్రెండ్‌ కొనసాగుతోంది. టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి మరో కొత్త చాలెంజ్‌కు స్వీకారం చుట్టాడు. ఇప్పటికే ఫిట్‌ ఇండియా, కికీ‌, ఐస్‌ బకెట్‌ చాలెంజ్‌లు ప్రాచూర్యం పొందిన విషయం తెలిసిందే. ఫిట్‌ఇండియాతో ఆరోగ్యంపై తీసుకోవాల్సిన శ్రద్ద గురించి విస్తృత ప్రచారం కల్పించారు. ఈ చాలెంజ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి సామాన్యుడి వరకు పాల్గొన్నారు.  ఈ తరహాలోనే భారత సంప్రదాయలపై విస్తృత ప్రచారం కల్పించాలని కోహ్లి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా #Veshbhusha చాలెంజ్‌ను తీసుకొచ్చాడు.

ఈ చాలెంజ్‌కు సంబంధించి ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. ‘తుమ్‌ ముజే కూన్‌ దో తుమ్హే ఆజాదీ దూంగా’ (మీరు మీ రక్తాన్ని ఇవ్వండి..నేను స్వాతంత్ర్యం తెస్తాను) అనే సుభాష్‌ చంద్రబోస్‌ సూక్తిని చెబుతూ.. చిన్నప్పటి నుంచి ఈ సూక్తులు వింటున్నామని, స్వాతంత్ర్యం దినోత్సం సందర్భంగా సంప్రదాయ దుస్తులు ధరించి భారత సంప్రదాయన్ని చాటుదామని పిలుపునిచ్చాడు. పంద్రాగస్టు రోజు సంప్రదాయంగా సిద్దమై ఆ ఫొటోలను వేష్‌బుషా యాష్‌ ట్యాగ్‌తో అప్‌లోడ్‌ చేసి ఇతరులకు చాలెంజ్‌ విసరాలని పేర్కొన్నాడు. తాను ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌, యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌పంత్‌లకు ఈ చాలెంజ్‌ విసురుతున్నట్లు తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది. 5 టెస్టుల సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న కోహ్లిసేన తొలి టెస్టు ఓడిన విషయం తెలిసిందే. రెండో టెస్టు రేపటి(గురువారం)నుంచి ప్రారంభం కానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top