25వ సారి డబుల్స్ ఫైనల్‌కు | The 25th time in the doubles final | Sakshi
Sakshi News home page

25వ సారి డబుల్స్ ఫైనల్‌కు

Aug 24 2013 1:41 AM | Updated on Sep 1 2017 10:03 PM

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ లో మరో మైలురాయిని అధిగమించింది. న్యూ హెవెన్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించడం ద్వారా డబ్ల్యూటీఏ డబుల్స్ ఈవెంట్‌లో 25వ సారి ఫైనల్‌కు చేరిన భారత క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది.

 న్యూ హెవెన్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా డబుల్స్ లో మరో మైలురాయిని అధిగమించింది. న్యూ హెవెన్ ఓపెన్‌లో తుదిపోరుకు అర్హత సంపాదించడం ద్వారా డబ్ల్యూటీఏ డబుల్స్ ఈవెంట్‌లో 25వ సారి ఫైనల్‌కు చేరిన భారత క్రీడాకారిణిగా రికార్డుల్లోకెక్కింది.
 
  జీ జెంగ్‌తో కలిసి మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సానియా శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 6-3, 6-3తో సిల్వియా సొలెర్- కార్ల సూరెజ్ (స్పెయిన్) జంటపై గెలుపొందింది. ఇప్పటివరకూ సానియా ఆడిన 24 డబుల్స్ ఫైనల్స్‌లో 16 సార్లు విజేతగా నిలిచింది.
 

Advertisement
 
Advertisement
Advertisement